మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కులో డీఎఫ్‌ఓ ఎం. జోజీ ఆధ్వర్యంలో బుధవారం ట్రెక్కింగ్ నిర్వహించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో నాలుగో రోజులో భాగంగా బీవీఆర్‌ఐటీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ విద్యార్థులు, అక్షర పాఠశాల విద్యార్థులతో సైక్లింగ్, ట్రెక్కింగ్ నిర్వహించారు. నర్సాపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అరవింద్, నర్సాపూర్ రేంజ్ సిబ్బంది సమక్షంలో అటవీ ప్రాంతం, ఇతర అటవీ కార్యకలాపాలలో అటవీ, వన్యప్రాణుల సంరక్షణ, మంటల నివారణ ప్రాముఖ్యత గురించి వివరించారు.
పోచారం డిబిసిలో…వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం -2024 సందర్భంగా మెదక్ జిల్లా పోచారం వన్యప్రాణుల అభయారణ్యంలో వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు. బూరుగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, పక్షుల పరిశీలన, వనదర్శిని, డిజిటల్ ఆవిష్కరణల గురించి వివరించారు.
ఈ సందర్భంగా డి ఎఫ్ ఓ జోజి మాట్లాడుతూ ప్రజాపాలన… ప్రజా విజయోత్సవ వేడుకల్లో బాగంగా నేడు అటవీశాఖ శాఖ కార్యక్రమాలు నిర్వహించాలన్న ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రజాపాలన .. ప్రజా విజయోత్సవ వేడుకలు దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 9వ తేది వరకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో . ఎఫ్ఆర్ఓ ఏ.మనోజ్ కుమార్, ఎఫ్ఎస్ఓ ఎ.స్రవంతి, బీట్ ఆఫీసర్లు రాము, ప్రియాంక, అటవీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.