కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఒక్క లక్ష యాభై వేల రుణమాఫీ చేసిందని, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. 1,50,000 రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మండల వ్యాప్తంగా సుమారు 5000 మంది రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రుణం నుంచి విముక్తి కలిగిందని, రాబోవు రోజుల్లో మరికొంతమంది రైతులకు సంబంధించిన రెండు లక్షల రుణమాఫీని చేసి పూర్తిగా రుణ విముక్తులను చేస్తామని వారు తెలిపారు. రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలోమండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి రాష్ట్ర ఫిషర్మన్ కార్యదర్శి తలారి మల్లేష్ మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి ఆరెగూడెం మాజీ సర్పంచ్ బాల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు