- బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం
- బేరం కుదరకపోతే నిందితులను పోలీసులకు అప్పగించిన స్థానికులు
మాసాయిపేట (చేగుంట) : మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ శివారులోని ఓ గ్రామంలో బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఎస్సై చైతన్యరెడ్డి తెలిపారు. శనివారం నమోదు చేసిన పోక్సో కేసు వివరాలను వెల్లడించారు. బాలిక (16) తల్లిదండ్రులు శుక్రవారం మనుమరాలు అమ్ముకునేందుకు వర్గల్ మండలంలోని అనంతగిరిపల్లికి వెళ్లగా.. రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని.. బాలిక చిన్నాన్న, అన్న కలిసి తూప్రాన్ ఆసుపత్రికి, అక్కడి నుంచి సికింద్రాబాద్ గాంధీకి తీసుకె ళ్లారు. క్షతగాత్రులు తూప్రాన్ ఆసుపత్రిలో ఉండగా.. అదే గ్రామానికి చెందిన లకావత్ ప్రవీణ్.. బాలిక పిన్నిని ద్విచక్ర వాహనంపై ఆసుపత్రిలో దింపి వచ్చాడు. అప్పుడే బాలిక ఇంటి వద్ద ఒంటరిగా ఉందన్న విషయం గ్రహిం చాడు. సాయంత్రం బాలిక పొలం పనికి వెళ్లి వచ్చి గుడిసెలో నిద్రపోయింది ముందే ప్రణాళిక వేసుకున్న ప్రవీణ్.. మాసాయిపేట మండలం చెట్లతిమ్మాయి పల్లి గ్రామానికి చెందిన రాజును పిలిపించాడు. ఇద్దరూ కలిసి రాత్రి గుడిసెలోకి దూరి ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. అర్ధరాత్రి బాలిక చిన్నాన్న రాగా.. గుడిసెలో నుంచి బాలిక ఏడుపు వినిపించింది. లోపలినుంచి తడికలు తీయకుండా ఎవరో అడ్డుపడుతున్నట్లు గమనించి.. బాలిక చిన్నాన్న అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. అందరూ కలిసి నిందితులను పట్టు కొని చేగుంట పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలికను చికిత్స కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.