మెదక్ జిల్లా, తూప్రాన్ : మహిళలను ఐకమత్యం తో ప్రోత్సహించడమే మన సంస్కృతి, మన ధర్మం అని శ్రీ సరస్వతీ సేవా ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జానకిరామ్ అన్నారు. ఆదివారం మహంకాళి దేవాలయం ఆవరణలో శ్రీసరస్వతీ సేవాట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జానకిరామ్ మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినం సందర్భంగా తూప్రాన్ పట్టణంలోని మహిళలకు రంగవల్లులు ముగ్గుల పోటీలతో ప్రోత్సహించాలని సత్ సంకల్పం తో నిర్వహించినట్లు తెలిపారు. జనవరి 12 తేదీ ఉదయం ఆదివారం 6:30 నుండి 8:00 వరకు శాఖ సాంగీక్ నిర్వహించారు. స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం 2:00 లకు శ్రీ సరస్వతీ సేవా సమితి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహక బహుమతి అందజేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వడం జరిగింది. రాష్ట్రీయ స్వయంసేవక్* సంఘ్ యొక్క సంక్రాంతి ఉత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి శిరిషగారు, ప్రధానవక్తగా శ్రీ బాగారెడ్డి గారు విభాగ శారీరక శిక్షణ ప్రముఖ్ లు హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఏపూరి రాజుభయ్యా తోపాటు రామునిగారి అశోక్ కుమార్ గౌడ్, స్వర్గం వెంకట నారాయణ, తాటి వెంకటేష్, గెంట్యాల నాగరాజు, కోడిప్యాక సంతోష్ గుప్త, పోల శ్రీనివాస్ గుప్త తదితరులు పాల్గొన్నారు.
