మెదక్ జిల్లా : జిల్లా ఎస్.పి. .డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం నాడు మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జడ్.పి.హెచ్.ఎస్మాచవరం నందు కళాబృందం ప్రోగ్రాం నిర్వహించగా సైబర్ క్రైమ్ డి ఎస్పి సుభాష్ చంద్ర బోస్ మెదక్ రూరల్ ASI శివకుమార్ మెదక్ జిల్లా కళా బృందం సిబ్బందితో కలిసి నూతన చట్టాలు, రోడ్డు ప్రమాదాలు మరియు ట్రాఫిక్ నియమాలు, సైబర్ మోసాలు, షి టీమ్స్, గంజాయి నివారణ పై అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా సైబర్ క్రైమ్ డి ఎస్పి . సుభాష్ చంద్ర బోస్ ఈ మధ్యకాలం లో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని, సైబర్ నేరగాళ్ల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని, ఎవరైనా మోసపోయినట్టైతే 1930 నంబర్ కి పిర్యాదు చేయాలని, యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకూడదని, వాహన దారులు తాగి డ్రైవింగ్ చేయవద్దని, లైసెన్స్ లేకుండ వాహనాలు నడపవద్దని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ఆవశ్యకత గురించి వివరించారు.
గ్రామాల్లో అనుమానస్పదంగా వ్యక్తులు కనపడితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. మంత్రాలు అంటూ ముడనమ్మకాలు నమ్మవద్దని, గ్రామాల్లో ఏ సమ్యస వున్న వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో తెలుపాలన్నారు, లేదా 100 నెంబర్ కు ఫోన్ చేస్తే నిమిషాల్లో పోలీసులు తమ వద్దకు వస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డిఎస్పి . సుభాష్ చంద్ర బోస్ మెదక్ రూరల్ ఎన్ ఐ శివకుమార్ గారు కళా బృందం సిబ్బంది మరియు స్కూల్ యాజమాన్యం 320 విద్యార్థులు హాజరయ్యారు.