మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట శివారులోని రామంతపూర్ హెచ్ పి పెట్రోల్ పంప్ ప్రక్కన బాబా రాందేవ్ రాజస్థానీ ధాబాలో హర్యాన కు చెందిన గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి గంజాయి కొడుతూ రిపోర్టర్ టివి కెమెరాకి చిక్కారు.
గత కొన్నేళ్లుగా డ్రగ్స్, గంజాయి వాడకం విచ్చలవిడిగా పెరిగింది. ఎక్కడపడితే అక్కడ ఇబ్బడిముబ్బడిగా గంజాయి దొరుకుతుంది. మత్తు పదార్థాలను అక్రమ రవాణాకు చెక్ చెక్ పెట్టాల్సిన స్థానిక తూప్రాన్ డివిజన్ పోలీసులు మాత్రం తాగండి తాగి ఊగండి అంటూ గాలికొదిలేశారు.
హైవే లో దాబాలు నడుపుతున్న వారి పై ద్రుష్టి పెట్టకుండా తూప్రాన్ డివిజన్ పోలీసులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. హైవే పోలీస్ పెట్రోలింగ్ ఊసే లేదు. దాబాలు నడుపుతున్న వారు గంజాయి, నల్ల మందు అమ్ముతున్నారా ? లేక గంజాయి రవాణా చేస్తున్నారా అనే విషయం తేలాల్సి ఉంది. ఈ విషయం పై ఉన్నతాధికారులు స్పందిస్తారా లేదా వేచి చూడాలి. చూస్తూనే ఉండండి రిపోర్టర్ టీవీని మరో బ్రేకింగ్ న్యూస్ తో మీ ముందుకొస్తాం.