contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మెదక్ జిల్లా నూతన ఎస్పీ గా బాలస్వామి

  • మెదక్ జిల్లా నూతన ఎస్పీజిల్లా ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లడి
  • ప్రజల సేవ కోసం ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాం
  • ప్రజలకు ఏ సమస్య ఉన్న నేరుగా కలవవచ్చు
  • అక్రమాలకు పాల్పడే వారు మానుకోవాలి నూతన ఎస్పి బాలస్వామి వార్నింగ్నూ
  • తన ఎస్పీకి పుష్పగుచ్చం అందజేసి జిల్లా పోలీస్ అధికారులు స్వాగతం పలికారు

 

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నూతన ఎస్.పి గా వచ్చిన డాక్టర్, బి. బాలస్వామి ని జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్ .ఎస్.మహేందర్ పుష్ప గుచ్చం ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు అనంతరం గౌరవ వందనం స్వీకరించి జిల్లా ఎస్.పి గా బాధ్యతలు స్వీకరించడమైనది. 2018 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన డాక్టర్ .బి.బాలస్వామి కాగజ్ నగర్ లో ఇన్ఛార్జి ఎస్.డి.పి.ఓ గా పనిచేసి అక్కడ నుండి తేదీ: 20.11.2021 లో మెదక్ జిల్లా అదనపు ఎస్పి అడ్మిన్ గా పనిచేసి ఇక్కడ నుండి రాచకొండ కమిషనరేట్ లో ఎస్.బి డి.సి.పి గా పని చేసి అక్కడ నుండి సౌత్ వెస్ట్ జోన్ హైదరబాద్ సిటి డి.సి.పి గా పనిచేసి ప్రస్తుతము మెదక్ జిల్లా ఎస్పి గా పదవి భాద్యతలు తీసుకోవడం జరిగింది. ఈ సంధర్భంగా జిల్లా కు వచ్చిన నూతన ఎస్పి డాక్టర్ . బి. బాలస్వామిని మెదక్ సబ్ డివిజన్ డిఎస్పి . ఫణీంద్ర తూప్రాన్ సబ్ డివిజన్ డిఎస్పి .యాదగిరి రెడ్డి , డి.సి.ఆర్.బి డిఎస్పి . శ్రీనివాస్ రెడ్డి , సైబర్ సెల్ డిఎస్పి ఎస్‌ఆర్. సుభాష్ చంద్ర భోస్, ఏ.ఆర్ డిఎస్పి ఎస్‌ఆర్.రంగ నాయక్ , జిల్లా సిఐలు మరియు ఆర్.ఐ లు, ఎస్.ఐ లు ఏ.ఆర్ ఎస్.ఐ లు డి.పి.ఓ సిబ్బంది కలవడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి డాక్టర్ .బి.బాలస్వామి మాట్లాడుతూ… జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి ప్రజల సేవ కోసం తాను ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని ప్రజలకు ఏ సమస్య ఉన్న తనను నేరుగా కలవవచ్చనని అన్నారు. అలాగే జిల్లాలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే మానుకోవాలని లేదంటే అట్టి వారిపై చట్ట పరమైన కఠిన చర్యలు ఉంటాయని ప్రజా శాంతికి ఎవరైనా భంగం కలిగించాలని చూస్తే ఉరుకునేది లేదని జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలు, అక్రమ కార్యకలాపాలు, రోడ్డు ప్రమాదాలు మొదలైన వాటి పై ప్రత్యేక దృష్టి పెడతామని తరచుగా నేరాలు చేసే వారు తమ పద్దతి మానుకుని సమాజంలో మంచిగా బతకాలని అలాగే ప్రజలు పోలీస్ స్టేషన్ కు వివిధ రకాల అభ్యర్థనలు/ ఫిర్యాదులు/ సమాచారం/ సహాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి తగు సేవలు అందించడంలో ముందుండాలని ప్రజలందరికీ పోలీస్ వ్యవస్థ పై నమ్మకం విశ్వాసం కలిగేలా విదులు నిర్వహించాలని బాధితులతో మర్యాదపూర్వకంగా స్నేహపూర్వకంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :