తెలంగాణ రాష్ట్ర చరిత్రలో రెండో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ఇవాళ పదవీప్రమాణ స్వీకారం చేశారు. 2014లో తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ రెండు పర్యాయాలు సీఎంగా వ్యవహరించగా, తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనపై అభినందనల వర్షం కురుస్తోంది.
ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్ శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదాలు మీ పాలనలో పునరావృతం కాకూడదని నేను ఆశిస్తున్నాని సుధాకర్ ట్వీట్ చేసారు .
టీడీపీకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి, నేడు సీఎం పదవిని అధిష్ఠించారు. ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. తన ట్వీట్ లో ఎనుముల రేవంత్ రెడ్డి గారు అంటూ గౌరవంగా సంబోధించారు.
ఏపీ సీఎం జగన్ కూడా సోషల్ మీడియాలో స్పందించారు. “తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
Hearty Congratulation to @revanth_anumula Garu, for taking oath as Chief Minister of Telangana . May your leadership bring prosperity, progress and harmony to the state. I hope that the terrible mistakes of #BRS Govt will not be repeated under your rule.
I Wish you the Very Best— V.Sudhakar |Chairman | Print & Electronic Media (@Sudhakarpress) December 7, 2023