సిద్దిపేట జిల్లా: బెజ్జంకి మండల కేంద్రంలో బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం లింగాల లక్ష్మణ్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు లింగాల వెంకటేష్ సౌజన్యంతో ఆదర్శ హాస్పిటల్ – కరీంనగర్ వారి అధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నీ *ఎంపీపీ శ్రీమతి లింగాల నిర్మల లక్ష్మణ్, స్థానిక సర్పంచ్ శ్రీమతి ద్యావనపల్లి మంజుల శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు.
అనంతరము *ఎంపీపీ శ్రీమతి లింగాల నిర్మల మాట్లాడుతూ మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని, ప్రతీ ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనీ, మానవ సేవే మాధవ సేవ అనే సంకల్పంతో ముందుకు వచ్చిన ఆదర్శ హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు”.
ఆదర్శ హాస్పిటల్ *డా. మామిడి అనిల్ రెడ్డి, మామిడి పవిత్రరెడ్డి మాట్లాడుతూ
*”బెజ్జంకి పట్టణంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతమైందని, బెజ్జంకి తో పాటు సమీప గ్రామాల ప్రజలు వైద్య శిబిరానికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారని,వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి డాక్టర్లు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారని,ECG, బి.పి, షుగర్ పరీక్షలతో పాటు, ప్రజలకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై ప్రవీణ్ రాజ్,AMC చైర్మన్ కర్చు రాజయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కనగండ్ల తిరుపతి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, ఎంపీటీసీ శ్రీమతి గుబిరే శారద మల్లేశం, ప్యాక్స్ వైస్ చైర్మన్ బండి రమేశ్,బీఆర్ఎస్ మండల అదికార ప్రతినిధి బోనగిరి శ్రీనివాస్,AMC డైరక్టర్ దీటి రాజు, మాజీ AMC డైరక్టర్ మిట్టపల్లి చెన్నారెడ్డి, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నియోజక వర్గ ఉపాధ్యక్షులు బిగుల్ల సుదర్శన్, యువజన విభాగం మండల అధ్యక్షులు బిగుల్ల మోహన్, లింగాల లక్ష్మణ్ యువసేన సభ్యులు బూర రాజు, రామంచ పర్షరాములు, జెరిపోతుల సునీల్, బోనగిరి శరత్, తాడిచెట్టు శ్రీనివాస్, ఆదర్శ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.