contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అందుకే చేతులు జోడించి అడిగా: చిరంజీవి

టికెట్‌ ధరలు, సినిమా పరిశ్రమలోని ఇతర సమస్యల పరిష్కారానికి చిరంజీవితోపాటు పలువురు సినీ ప్రముఖులు ఫిబ్రవరిలో ఏపీ సీఎం జగన్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే.ఆ సమయంలో చిరంజీవి చేతులు జోడించి జగన్‌తో మాట్లాడటంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. చిరంజీవి స్థాయి ఏంటి? చేతులు జోడించి పరిష్కారం అడగడం ఏంటి అని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు తప్పుబట్టారు. ఇవన్నీ చిరంజీవి చెంతకు చేరినా ఆయన ఏమాత్రం స్పందించలేదు, తాజాగా ఆయన ఆ విషయంపై మాట్లాడారు.

”నన్ను విమర్శించినా, తిట్టినా పట్టించుకోను. మొదటి నుంచి ఇదే పాలసీ నాది. ఒకసారి వెనక్కి వెళ్లి చూసుకుంటే నేను చేతులు జోడించి వేడుకున్నది ఓ ముఖ్యమంత్రిని. ఆ కుర్చీకి ఉన్న గౌరవం అది. గతంలో జరిగిన ఓ సంగతి చెబుతాను. నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు, నా కన్నా వయసులో పెద్దవారు నా అపాయింట్‌మెంట్‌ కోసం గంటల తరబడి వేచి చూసేవారు. అది నా గొప్పతనం కాదు. నా కుర్చీకి వారు ఇచ్చిన గౌరవం. ఇది పరిశ్రమ సమస్య… ఒక దారికి తీసుకురావాలి అనే సంకల్పంతో నేను అలా చేశారు. ఆ రోజున సమస్యకు పరిష్కారం తీసుకురాకపోతే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ఈ అంకెలు కనిపించేవా? ఇండస్ర్టీ ఇంతలా కళకళలాడేదా? బాధ్యతగా ఆలోచించాను కాబట్టే ముఖ్యమంత్రిని కలిశా. ఆ సమయంలో కోట్లు ఖర్చు చేసి సినిమాలు తీసిన నిర్మాతలంతా అగమ్యగోచరంగా ఉండిపోయారు. పరిశ్రమ మనుగడకి సంబంధించిన సమస్య అది. అందుకే చేతులు జోడించి వివరించా. అది చూసి ఒకొక్కరు ఒక్కో రకంగా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో కూడా నాకు తెలుసు. నా ఒక్కడి కోసమే అలా చేేస్త ఆ రోజు నేను తల వించి సిగ్గుపడతా. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందితో ముడిపడిన సమస్య ఇది. దాని పరిష్కారానికి దేవుడు నాకు ఇచ్చిన ఓ అవకాశంగా భావించా” అని అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :