జగిత్యాల జిల్లా / మెట్ పల్లి : ఎస్సి వర్గీకరణ కొరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ మౌళిక సూత్రాలకు విరుద్ధంగా ఉందని, కేవలం రాజకీయ కోణంలో కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా వర్గీకరణ ఉందంటూ దేశవ్యాప్త బందులో భాగంగా జగిత్యాల జిల్లా, మెట్ పల్లి మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. మాల మహానాడు కార్యకర్తలు భారీ సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహిస్తూ వ్యాపార సంస్థలు బంద్ లో పాల్గొనాలని కోరారు. అనంతరం ఆర్డీవో ఆఫీస్ వద్దకు వెళ్లి సుప్రీంకోర్టు తీర్పును పున:పరిశీలించేలా చొరవ తీసునివాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ ఎస్సి వర్గీకరణ వల్ల మాలలు చాలా నష్టపోతారని కేంద్ర ప్రభుత్వం పరిశీలించి మాలలకు న్యాయం చేయాలని కోరారు.