జగిత్యాల జిల్లా మెట్ పల్లి ప్రభుత్వ సామజిక వైద్యశాలలో వైద్యుల ఆగడాలు రోజుజుకు పెరుగుతున్నాయి. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొందరు వైద్యులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గురువారం ఒకే రోజు ఎనమిది మందికి సర్జరీ చేయాల్సి ఉండగా, ఆసుపత్రికి వచ్చిన వైద్యురాలు ఏసీ పనిచేయడం లేదని వెళ్ళిపోయింది. తీరా ఏసీ రిపేర్ అయినతరువాత నేను ఈరోజు రాను రేపు కుదిరితే వస్తానంటూ, ఈ విధంగా గత మూడు రోజులుగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తుందంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొందరు స్వంత క్లినిక్ లు నడుపుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల నిలక్షయంగా వ్యవహరిస్తున్నారు. కావున ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఇటువంటి వైద్యుల లెసెన్సులు రద్దు చేసి , ఐపీసీ సెక్షన్ 129 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.