జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ పాల్గొని రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి అనంతరం అందరూ కలిసి సంతోషంగా బతుకమ్మ ఆడారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ రాష్ట్ర అధ్యక్షురాలు సాయి ఈశ్వరి మాట్లాడుతూ తెలంగాణలో మహిళలు వేడుకగా జరుపుకునే పండుగ బతుకమ్మ అని, పువ్వులను పూజించే గొప్ప సంప్రదాయం తెలంగాణలో మాత్రమే ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను ప్రభుత్వము అధికారికంగా నిర్వహించడంతో మహిళలు ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు. ఎంగిలి పూల బతుకమ్మ తో ప్రారంభమై సద్దుల బతుకమ్మ తో 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో సాయి ఈశ్వరి, అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ రాష్ట్ర అధ్యక్షురాలు, భాగ్య లక్ష్మీ, అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ రాష్ట్ర కార్యదర్శి , పద్మ, అంగన్వాడీ టీచర్ , దయవతి, అంగన్వాడీ టీచర్