గిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో, మెట్ పల్లి పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న సుబ్బరాజు మృతి చెందారు.
నిజామాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్, నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న సమయంలో హోండా షోరూం వద్ద బైకును ఢీ కొట్టింది. ఈ ఘటనలో సుబ్బరాజు తలకు తీవ్ర గాయాలు కావడంతో, అక్కడికక్కడే ఆయన మృతి చెందారు.
సుబ్బరాజు కు భార్య, ముగ్గురు కొడుకులు, కుమార్తె ఉన్నారు. ఈ దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు ఈ ప్రమాదంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.