జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టిన అంబేద్కర్ స్టేడియం గదులు ఇప్పటికీ పూర్తికాకుండా వదిలేయడం వల్ల ఈ ప్రాంతం మందు బాబులకు అడ్డాగా మారింది. చీకటి పడగానే యువత అక్కడ గంజాయి, మద్యం తాగుతూ జల్సాలు చేస్తున్నారు.
స్టేడియం పరిసరాల్లోని దృశ్యాలను పరిశీలిస్తే, మద్యం మత్తులో బాటిళ్ళు పగులగొట్టి అక్కడే పడేసి పోతున్నారు. అంతేకాక వ్యభిచార గృహాలుగా కూడా వాడుకుంటున్నారని ఆరోపణలు లేకపోలేదు.
ఈ విషయంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.