జగిత్యాల జిల్లా, మెట్ పల్లి: భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మైనారిటీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం మరియు మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్తులకు అతిధుల చేత మెమోంటోలను అందజేశారు. చిన్నతనం నుంచి విలువలతో కూడిన విద్య ను అభ్యసించడం వల్ల ఉన్నత స్థాయికి చేరవచ్చునని, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని మహ్మద్ అజిజ్ కోరారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.