జగిత్యాల జిల్లా,మెట్ పల్లి: మెట్ పల్లి శివారులో రేగుంట – ఇబ్రహీంపట్నం కెనాల్ రోడ్డులో సోమవారం రాత్రి అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో మెట్ పల్లి కి చెందిన జక్కం భూమేష్ 30 అక్కడిక్కడే మృతి చెందాడు.మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
