జగిత్యాల జిల్లా,మెట్ పల్లి : వినాయక మండపాలు ఏర్పాటు చేసేందుకు తప్పనిసరిగా అనుమతి పొందాలని మెట్ పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితిని పురస్కరించుకుని మండపాల ఏర్పాటు అనుమతుల కోసం వినాయక విగ్రహాల ఏర్పాటు కోసం చందాలు బలవంతంగా వసూలు చేయరాదని తెలిపారు.
మెట్ పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు ,సిఐ నిరంజన్ రెడ్డి ఎస్సై చిరంజీవి రాజు ఆదేశాల మేరకు రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలకు డీజే లకు అనుమతి లేదని నిబంధనలు. పాటిస్తూ కులమతాలకు అతీతంగా భక్తి భవనతో ఉత్సవాలు నిర్వహించుకోవాలని పలు సూచనలు చేశారు.
మండపాల నిర్మాణం కోసం విద్యుత్ ప్రమాదాలు మండపాలలో సిసి కెమెరాలు పెట్టుకోవాలని రాత్రి టైంలో మండపాల దగ్గర రాత్రి టైం లో స్పీకర్లు 10 గంటలకు బంద్ చేసుకోవాలి ఒక్కరు కంపల్సరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిరువకులకు సూచించారు.
ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు మాత్రమే నిమజ్జనం చేయాలి అన్ని కుల సంఘాలు యూత్ సంఘాలు తో తెలియజేశారు..
ఉల్లఘించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. ఏ సమస్య ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వినాయక చవితి నిర్వహకులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.