జగిత్యాల జిల్లా మెట్ పల్లి : మెట్ పల్లి పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇబ్రహీంపట్నం మల్లాపూర్ మండలాలకు చెందిన సుమారు 30 మంది రౌడీషీటర్లతో సిఐ నిరంజన్ రెడ్డి మెట్ పల్లి ఎస్సై కిరణ్ కుమార్, ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్, మల్లాపూర్ ఎస్సై రాజులు కలిసి రౌడీషీటర్లతో డిసెంబర్ 31 వ తేదీన ఎవరైనా త్రాగి రోడ్లపై తిరిగిన రోడ్లపై కేకులు కట్ చేయడం బాణసంచాలు పేల్చడం చేసినట్లయితే వారిని కఠినంగా శిక్షిస్తామని వారిపై ఇప్పటికే రౌడీషీటర్లుగా పేర్లు నమోదు చేయడం వలన వారు ఇకనుండి ఏదైనా గొడవలో వెళ్తే వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయడం జరుగుతది అన్నారు. ఇక నుండి వారు మంచి ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే వారిపై ఉన్న రౌడీ షీటర్ లను తొలగించడానికి మా పై అధికారులకు సిఫారస్ చేస్తామని తెలిపారు. ఇకనైనా వారిలో మార్పు వస్తుందని 2025 సంవత్సరము నుండి మంచి ప్రవర్తనతో కలిగి ఉంటారని అలా ఉన్నట్లయితే వారిపై ఉన్న రౌడీ శీటర్లను తీసివేయడం ప్రయత్నిస్తామని అన్నారు. ముఖ్యంగా గంజాయి ఎవరైనా విక్రయించిన త్రాగిన వారిపై కఠిన చర్యలు తీసుకొనబడతాయని హెచ్చరించారు.