మీ పిల్లలను మిలటరీ స్కూల్ లో చేర్పించాలని చూస్తున్నారా… అయితే, ఈ వివరాలు మీకోసమే. రాష్ట్రీయ మిలటరీ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.
దేశవ్యాప్తంగా ఉన్న మిలటరీ స్కూళ్లలో 6, 9వ తరగతులలో అడ్మిషన్లు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఐదో తరగతి పూర్తిచేసిన లేదా చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు ఈ నెల 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అదేవిధంగా తొమ్మిదో తరగతిలో అడ్మిషన్ కోసం ఎనిమిదో తరగతి పూర్తిచేసిన లేదా చదువుతున్న వారు అర్హులని చెప్పారు. కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
కావాల్సిన అర్హతలు ఇవే..
6వ తరగతికి… ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి పూర్తిచేసి ఉండాలి. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న వారు కూడా అర్హులే. వయసు 10 నుంచి 12 ఏళ్ల మధ్య ఉండాలి.
9వ తరగతికి… ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 8వ తరగతి పూర్తిచేసి ఉండాలి. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న వారు కూడా అర్హులే. వయసు 13 నుంచి 15 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక జరిగేదిలా..
కామన్ ఎంట్రెన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్.. ఆయా టెస్ట్ లలో ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్ల ప్రకారం సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఈ ఎంపిక ప్రక్రియ కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది.
చివరి తేదీ: సెప్టెంబర్ 19 లోగా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.rashtriyamilitaryschools.edu.in వెబ్ సైట్ సందర్శించండి