పల్నాడు జిల్లా, బెల్లంకొండ: బెల్లంకొండ మండలం పాపాయి పాలెం గ్రామంలో తన భూమిలో అక్రమ మైనింగ్ జరుగుతోందని యరగాని నాగమ్మ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసారు. వివరాల్లోకి వెళితే తన పూర్వీకుల నుండి సంక్రమించిన 3 ఎకరాల సాగు భూమికి పాస్ పుస్తకాలు, 1బి అడంగల్, సర్వే సర్టిఫికెట్ ఉన్నాయని, అయితే ..
యరగాని నాగమ్మ తమ్ముడు యడవల్లి శ్రీనివాసరావు ఆ భూమిని మైనింగ్ లీజు కోసం అప్లై చేయగా, సమీపంలోని సర్వే నంబర్ 338/7-1లోని ప్రభుత్వ భూమిని, గుదే లక్ష్మణ్ బాబు మైనింగ్ ని లీజుకు తీసుకున్నాడు. ఆ భూమిని గుదే లక్ష్మణ్ బాబు గుంటూరుకు చెందిన అర్తిమళ్ల శ్రీనివాస్ కు సబ్ లీజ్ కు ఇచ్చాడు. అర్థిమళ్ళ శ్రీనివాస్ సమీపంలో ఉన్న యరగాని నాగమ్మ భూమిలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నాడని తెలిసి అడుగగా
అర్థిమళ్ళ శ్రీనివాస్ వారిని బెదిరించి, “నేను అధికార పార్టీకి చెందిన నాయకుడిని, నన్ను ఎవరు ఏమి చేయలేరని అలాగే అర్థిమళ్ల శ్రీనివాస్ కుమారుడు చంద్రబాబు కూడా మీరు అడ్డొస్తే చంపడానికైనా వెనుకాడమని బెదిరిస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
యరగాని నాగమ్మ , యడవల్లి శ్రీనివాసరావు బెల్లంకొండ తహసీల్దారు కు ఫిర్యాదు చేయగా సర్వేయర్‌ను పంపినప్పుడు, చంద్రబాబు సర్వేయర్‌ను అడ్డుకున్నట్టు సమాచారం. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.