పార్వతీపురం మన్యం జిల్లా : అచ్చం మైనింగ్ లీజు ను రద్దు చేయాలని పెద్ద గుడభ గ్రామస్తులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గరుగుబిల్లి మండల ఎమ్మార్వో ఆధ్వర్యంలో జాయింట్ కమిటీ మంగళవారం పరిశీలనకు వచ్చారు. కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గ్రామాల రైతులు పాల్గొన్ని క్వారీ వలన కలిగే ఇబ్బందులను తెలియజేశారు. 2007 లో చిన్న గొడభ గ్రామంలో ఎన్ని వారి మెట్ట, నెల్లివారి మెట్ట రెండు క్వారీలను మొదలుపెట్టి రెండు క్వారీలు కూడా పూర్తిగా అనుమతులను దాటిపోయి విరుద్ధంగా సుమారు 80 అడుగులు లోతుగా రిగ్గు బ్లాస్టింగ్ లతో తవ్విండం వలన చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములు, తోటలు పూర్తిగా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న గొడభ కొత్త క్వారీ అనుమతులు సర్వే నెంబరు వన్ లో ఇవ్వడం జరిగిందని దానిలో 37 ఎకరాలలో క్వారీ కి అనుమతులు ఇచ్చారు. 37 ఎకరాలతో పాటు చుట్టుపక్కల ఉన్న 60 నుంచి 70 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని క్వారీ నుండి క్రసర్ కి రాయి లోడ్ పెరగడం కోసం ఒడిగల చెరువు గడ్డను కప్పేసి పూర్తిగా సొంత రోడ్డును తయారు చేసుకున్నారు ఉన్నారని ఆరోపించారు. జంజావతి కాలువ మధ్యలో అనుమతులు లేకుండా రెండు దగ్గరలా ఒక కల్వర్టులను కట్టించడం వలన చుట్టుపక్కల ఉన్న రైతుల పొలాల్లో ధూళి దుమ్ముల వలన పూర్తిగా నాశనం అవుతున్నాయని అన్నారు. నాగావళి కాలువ పైన 40 నుంచి 50 టన్నుల రాయి లారీ బరువు పెరగడం వలన కాలువ కుంగిపోయి గ్రామానికి నీరు వచ్చి పడుతుందని అన్నారు. చుట్టుపక్కల ఉన్న రైతులకు దుమ్ము ధూళి లేకుండా వాటరింగ్ చేయడానికి మరియు చుట్టు కూడా గ్రీనరీ పెంచడం కోసం మా గ్రామ పెద్దలతో అగ్రిమెంట్ చేసి ఉన్నప్పటికీ ఇప్పుడు పూర్తిగా వాటర్ చేయకుండా రైతులకు పెద్దలకు గ్రామానికి హాని కలిగిస్తున్నాడు. చుట్టూ ఉన్న గెడ్డలు, చెరువులను మాయం చేసిన అచ్చం మైనింగ్స్ యాజమాన్యం. పరిమితికి మించి మైనింగ్ తవ్వకాలు జరుపుతున్నారు అని అన్నారు. అధికారులను, పాలకులను, పెద్దలను వ్యవస్థను తప్పుదోవ పట్టించి ఎవరు ప్రశ్నిస్తే వారిని భయపెడుతూ తమ వ్యవసాయాన్ని నాశనం చేసి, తమకు బతుకు లేకుండా చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ, చెరువులను, గెడ్డలను మాయం చేసి . విధ్వంసానికి పాల్పడుతున్న సదరు వ్యక్తిపై ఎన్ని ఫిర్యాదులు చేసినా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదన్నారు. తమ పొలాలకు సాగునీరు అందించే నెల్లివాని గెడ్డ, వాడుగుల చెరువుగెడ్డ చింతవాణి చెరువు గెడ్డ, ఎన్నివాని చెరువు గెడ్డలను మాయం చేసి, ఎర్ర బంద, నెల్లివాని చెరువులను కబ్జా చేశాడన్నారు. జంఝావతి, నాగావళి కాలువలను ఆక్రమించుకొని తన ఇష్టానుసారంగా వాటిపై పెత్తనం సాగిస్తున్నాడన్నారు. . క్వారీ వలన చిన్నగుడబ, పెద్దగుడబ, వల్లరగుడబ, కొంకడివరం, సన్యాసిరాజు పేట, బాలగుడబ, శివరాంపురం తదితర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు, రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు.
