- మే 25న ఉర్లోవ రెవెన్యూ పరిధిలో సత్యాగ్రహ దీక్ష జయప్రదం చేయాలి.
- గిరిజనులు సాగులో ఉన్న జీడి మామిడి తోటలో శ్రీ M/sలక్ష్మీ నరసింహ గ్రానైట్ క్వారీ మైనింగ్ లీజులు రద్దుచేయాలి.
- గిరిజనులు సాగులో ఉన్న జీడి మామిడి తోటలకు రెవెన్యూ రికార్డులో సాగు హక్కు కల్పించాలి.
- కొమిరి గ్రామంలో జీడిమామిడి రైతులు సాగు దారుల సమావేశంలో రైతుల డిమాండ్
అనకాపల్లి జిల్లా రావికమతం మండలం: కొమిరి గ్రామంలో గిరిజనులు పేదలు సాగుదారులు సమావేశం సొలం లక్ష్మీ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే.గోవిందరావు మాట్లాడుతూ…ఉర్లలో వ రెవెన్యూ పరిధిలో ఏ 444-26 సెంట్లు భూములు 314 మంది లబ్ధిదారులకు డి పట్టాలు మంజూరు చేశారు. కొమిరి గ్రామానికి సంబంధించి శ్రీ M/s లక్ష్మీనరసింహ గ్రానైట్ క్వారీ కి 18 హెక్టార్ల మైనింగ్ అనుమతులు ఇచ్చారు. అనుమతి ఇచ్చిన ప్రదేశంలో 17 కుటుంబాలు వారు 31 -52 సెంట్లు జీడి మామిడి తోటలో సాగుదారులుగా ఉన్నారు. వీరికి 25 ఎకరాల 80 సెంట్లు భూమికి డి పట్టా భూములు ఇచ్చినట్లుగా ఎంజాయ్మెంట్ సర్వే రిపోర్టులో రెవిన్యూ అధికారులు ద్వికరించారు. వీరిలో మూడు కుటుంబాల వద్ద నుండి 9 ఎకరాలు భూమిని మైనింగ్ కంపెనీ వారు కొనుగోలు చేశారు. మిగిలి ఉన్న21 ఎకరాలు జీడి మామిడి తోటలు ఉన్నాయి భూములో మైనింగ్ లీజులు రద్దు చేయాలి. గిరిజను వద్ద భూమిని కొనుగోలు చేసినటువంటి భూమికి సరిహద్దు నిర్వహించాలి. మిగిలి ఉన్న భూములో మైనింగ్ లీజులు రద్దు చేయాలి జిల్లా కలెక్టర్ గారు ఆదేశం మేరకు ఎంజాయ్మెంట్ సర్వేలో సాగుదారులను ప్రభుత్వ రికార్డులో సాగహక్కు కల్పించాలని. జీడి మామిడి తోటలో సాగులో ఉన్న గ్రానైట్ లీజులు వెంటనే రద్దు చేయాలని. సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. తక్షణమే జిల్లా జాయింట్ కలెక్టర్ ఉల్లావ రెవెన్యూలో సాగుదారులు ప్రదేశాన్ని సందర్శించి సాగులో ఉన్న అందరిని ప్రభుత్వ రికార్డులో సాగు హక్కు కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. లేకపోతే ఈనెల 25వ తేదీ నుండి ఉల్లావ రెవెన్యూ పరిధిలో సాగుదారులతో కలిపి సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించాలని సమావేశం తీర్మానించింది ఈ సమావేశానికి సోలం రాజబాబు. S లక్ష్మి. తదితరులు పాల్గొన్నారు