- పట్టించుకోని రెవెన్యూ అధికారులు
- స్థానిక తహశీల్దార్ వెంటనే మట్టి డంపును సీజ్ చేయాలని సిపిఐ డిమాండ్
సిద్దిపేట జిల్లా : బెజ్జంకి మండలంలోని వీరాపూర్ గ్రామంలో పోచమ్మ చెరువులో గత మూడు రోజుల నుండి జెసిబి, టిప్పర్లతో మట్టిని తీసి ఇటుకల బట్టి యాజమాన్యాలకు ఎలాంటి పర్మిషన్ లేకుండా మట్టిని విక్రయిస్తున్న జెసిబి, టిప్పర్ల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గురువారం బెజ్జంకి తహసిల్దారుకు బెజ్జంకి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. అక్రమంగా మట్టి కొడుతున్నటువంటి వ్యక్తిపై అధికారులు చర్యలు తీసుకొని మట్టి డంపు ను సీజ్ చేసి బహిరంగ వేలం వేసి రైతులకు న్యాయం చేయాలని మండల సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సంగం మధు, ఉపాధ్యక్షుడు బోనగిరి శ్రావణ్, సిపిఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేష్, పార్టీ నాయకులు నరేష్ తదితరులు పాల్గొన్నారు.