contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బాంబుల మోతతో బెంబేలు .. ఇష్టారాజ్యంగా మైనింగ్ మాఫియా

  • రష్యా… ఉక్రెయిన్ యుద్ధంలో జరుగుతున్న బాంబుపేలుళ్లు కావు. క్వారీలో పేలుల్లే
  • చోద్యం చూస్తున్న అధికారులు.
  • బీటల పాలవుతున్న ఇంటి గోడలు.
  • ఇళ్లపై పడుతున్న రాళ్లు బెంబేలెత్తుతున్న ప్రజలు.

 

ఇరుదేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో పేలుతున్న బాంబులు అనుకుంటే పొరపాటే. ఒకసారి లో జరుగుతున్న బ్లాస్టింగ్ ల వల్ల భారీ శబ్దాలతో ఇంటి గోడలు బీటలు వాడడమే కాకుండా గ్రామంలో రాళ్లు పడుతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.అసలు క్వారీ నిర్వహణకు అనుమతులు ఉన్నాయా లేదా అన్నది పక్కన పెడితే బ్లాస్టింగ్ అనుమతులు ఎవరు ఇచ్చారు ఇస్తే ఎలా ఇచ్చారు, గ్రామ సమీపాన క్వారీ నిర్వహణకు ఎలా అనుమతులు ఇచ్చారు ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు అన్న విషయాలు అంతుచిక్కని ప్రశ్నల్లా మారాయి.అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట  మండలం కొట్నపల్లి లో జరిగిన క్వారీ పేలుళ్లవి. ఎప్పుడో ఓసారి కూడా కాదు. క్వారీ కోసం బాంబు పేలుళ్లు నిత్యకృత్యమవడంతో గ్రామస్థులు బెంబేలెత్తిపోతున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని  గిరిజనులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. జాతీయ రహదారి నిర్మాణం నిమిత్తం దానికి సంబధించిన క్వారీ అయినప్పటికీ అన్ని అనుమతులు వున్నాయని దర్జాగా బాంబు పేలుళ్లతో గిరిజన గ్రామాలకు బెంబేలెత్తుస్తున్నారు. ఈ  క్వారీ కి అనుమతులు ఎలా ఇచ్చారో..! కిలో మీటరు అరకిలోమీటర్ల దగ్గరలో గిరిజన గ్రామాలు వున్నాయని మరచిపోయారా.. లేక కాసులకు కక్కుర్తి పడి పోతే పోని గిరిజనులు పోతారులే అని అనుమతులు ఇచ్చారా అన్నది అర్థం కాని ప్రశ్న గా మారింది. అల్లూరి జిల్లా హుకుంపేట మండలంలో క్వారీలు.పరిసర గ్రామస్థులను హడలెత్తిస్తున్నాయి. నాలుగు  ఏళ్లుగా క్వారీ  నడుస్తున్నా పెద్దమొత్తంలో తవ్వేందుకు కంప్రెషర్ జాకీ విధానంలో రాయిని పగులగొదుతున్నరా…? లేక  బోర్ బ్లాస్టింగ్ విధానంలో పేలుళ్లు జరుపుతున్నారా. అనేది అర్థం కాని పరిస్తితి గా మరింది. ఏదైనప్పటికీ  గిరిజన ప్రజలకు ఈ  క్వారీ ప్రమాదకరంగా  మారుతోంది. భారీ ఎత్తున పేలుళ్లు చేపడుతున్నారు. క్వారీ పరిసరాల్లోని రెండు కిలోమీటర్ల మేర భూమి దద్దరిల్లిపోతోంది. రాళ్లు పడి ఇళ్లు దెబ్బతింటున్నాయి. రేకులు, గోడలు పగులుతున్నాయి. పంటలు సైతం నష్టపోతున్నామని గిరిజన రైతులు విచారణ వ్యక్తపరుస్తున్నారు.రాళ్లు మీద పడటంతో. గ్రామస్థులు గాయపడిన సందర్భాలున్నాయి. క్వారీ చుట్టుపక్కల గ్రామాల్లో ఇంటి గోడలు పగల్లు వచ్చాయి. తరచూ ఇళ్లు మరమ్మతులు చేసుకోలేక గ్రామస్థులు.నానా ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ, పోలీసు శాఖల పర్యవేక్షణ కరవవడంతో పేలుళ్లు యథేచ్చగా జరుగుతున్నాయనే అభిప్రాయం పరిసర ప్రాంత ప్రజల్లో సర్వత్రా వ్యక్తమవుతోంది. సిబ్బంది మామూళ్ల మత్తులో పడి, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని.అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ సమస్యలు గురించి క్వారీ యజమాని కి పలు సార్లు స్థానిక ఎంపీటీసీ బాలకృష్ణ సమాచారం ఇచ్చిన పట్టించుకోలేదని ఎంపీటీసీ అని గౌరవం కూడా లేకుండా చాలా దురుసుగా మాట్లాడారని అవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి కైన క్వారీ నిలిపివేయాలని లేకుంటే చుట్టూ పక్క గ్రామాలు ప్రజలతో భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరిచారు. గోండ్వానా దండకరణ్య పార్టీ అల్లూరి జిల్లా చుంచు రాజబాబు మాట్లాడుతూ వైసిపి నాయకులు అండదండలతోనే ఈ క్వారీ నడుపుతున్నారని గిరిజనులు ఇన్ని ఇబ్బందులు పడుతున్న అధికారుల స్పందించకపోవడం చాలా విచారకరమని గిరిజనులు బినామీలు కింద మాది ఈ క్వాలిటీ అండగా ఉంటూ గిరిజనులకు అన్యాయం చేయడం సరికాదని చట్టాలను తుంగలో తొక్కుతున్నారని స్థానిక వైసిపి నాయకులే దీనికి ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు.పేలుళ్లతో తీవ్రంగా నష్టపోతున్నామని.ప్రాణాలు సైతం పోతున్నాయని అధికారులు ఇప్పటికైనా స్పందించి సమీప గ్రామాలకు న్యాయం చేయాలని ప్రజాసంఘాలు నాయకులు స్థానికులు కోరుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :