నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరు కండ్రిగ రిజర్వాయర్ ను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పరిశీలించారు. తొలుత పొంగూరు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొని అర్జీదారుల నుండి వినతలు స్వీకరించారు. అనంతరం అధికారులతో కలిసి రిజర్వాయర్ పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సోమశిల జలాశయానికి అనుసంధారమైన హై లెవెల్ కెనాల్ పనులు 11 సంవత్సరాల తర్వాత ప్రారంభిస్తున్నామని, మర్రిపాడు (మం) మెట్ట ప్రాంతం ప్రజల కల సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు అని తెలిపారు. హై లెవెల్ కెనాల్ పనులను గత ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళితే నిధులు మంజూరు చేసినప్పటికీ ఈ ప్రాంత ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో పనులు చేయకపోవడం హాస్యాస్పదమని అన్నారు.గడిచిన మూడు సంవత్సరాలుగా సోమశిల జలాశయం నుండి సముద్రానికి వృధాగా నీరు పోతున్నా మర్రిపాడు మండలానికి నీరు తీసుకు రాలేని దుస్థితిలో ఈ ప్రాంత నాయకులు ఉన్నారని విమర్శించారు.మర్రిపాడు మండల ప్రజలు గడిచిన పది సంవత్సరాలుగా తీవ్రంగా నష్టపోయారు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు హైలెవల్ కెనాల్ పూర్తి చేసి మర్రిపాడు (మం) ప్రజలకు నీరు అందించి తీరుతామని హామీ ఇచ్చారు.పడమటి నాయకుడు పల్లి, పొంగురు రిజర్వాయర్ ను 2026 మార్చి నాటికి పనులు పూర్తి చేసి సోమశిల జలాలను అందిస్తామని పేర్కొన్నారు.గత ప్రభుత్వంలో 60 శాతం భూసేకరణ చేశారని మిగతా 40 శాతం భూసేకణ చేసి అధికారుల సమన్వయంతో పనులు చేసేందుకు ముందుకు నాకెందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఆనం సంజీవరెడ్డి హైలెవల్ కెనాల్ ఆత్మకూరు నియోజకవర్గం లో మర్రిపాడు మండల ప్రజల కల అని ఈ సందర్భంగా తెలిపారు.