సద్దుల బతుకుమ్మ జరుపుకుంటున్న అక్కా చెల్లెళ్లకు శుభాకాంక్షలు.
బతుకమ్మ, దసరా పండుగ శుభ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభవార్త.
తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అడ్మిషన్లు. 1200మందికి కొత్తగా అడ్మిషన్లు. ఇది గొప్ప విజయం. 1200 సీట్లు ఒక విద్యాసంవత్సరంలో రావడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి.
సమైక్య రాష్ట్రంలో గాంధీ ఆసుపత్రికి వెళ్లి 2004 నుంచి 2014 వరకు నేను మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడాను.
తెలంగాణ వస్తేనే మెడికల్ కాలేజీలు వస్తయని, న్యాయం జరుగుతుందని మాట్లాడటం జరిగింది.
సమైక్య రాష్ట్రంలో మూడే మూడు మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్.
70ఏళ్ల సమైక్య పాలనలో మూడు కాలేజీలు వస్తే, ఏడేళ్లలో 17 కాలేజీలు తెచ్చుకున్నం. కొత్తగా 12 కాలేజీలు ఏడేళ్లో తెచ్చుకోగలిగాం. ఉస్మానియా, గాంధీ, సమైక్య రాష్ట్రంలో పెట్టిన 3 కాలేజీలు కలిపి ఐదు ఉంటే కొత్తగా తెలంగాణ రాష్ట్రం 12 కాలేజీలు పెట్టింది.
ఈ విద్యాసంవత్సరంలో 8 మెడికల్ కాలేజీలు పెట్టుకుంటున్నం. ఒక్క మెడికల్ కాలేజీకి 510కోట్ల చొప్పున సీఎం కేసీఆర్ గారు మంజూరు చేశారు. మొత్తం 4080 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది.
రాష్ట్ర ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. ఈ 8 మెడికల్ కాలేజీలకు మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతి వచ్చేందుకు కృషి చేసిన డీఎంఈ గారికి, 8 కాలేజీల ప్రిన్స్ పల్ కు, విమలా ధామస్ , డాక్టర్ వాణి గారికి అభినందనలు.
రిజ్వీ గారి కృషిని అభినందిస్తున్నా.
రాష్ట్రం ఏర్పడినపుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు 850 ఉంటే,ఈ విద్యా సంవత్సరంలో 2901 ఎంబీబీఎస్ సీట్లకు పెంచుకున్నం.
ఎంబీబీఎస్ సీట్లు 3.3 రెట్లు పెరిగింది. ఇది చారిత్రాత్మక విజయం.
ఇక తెలంగాణ విద్యార్థులు ఉక్రెయిన్, చైనా, ఫిలిఫ్పీన్ వంటి దేశాలకు వెళ్లి వైద్య విద్య అభ్యసించవలసిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితికి కారణం. సమైక్య పాలనలో తెలంగాణపై చూపిన వివక్షే.
సీఎం కేసీఆర్ గారు ప్రతీ జిల్లాకు మెడికల్ కాలేజీలు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలకు చెరుకున్నం. విడతల వారీగా మిగతా మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతాయి.
ఇది సీఎం కేసీఆర్ గార విజనరీ,లీడర్ షిప్ కు నిదర్శనం.
ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ- ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో 6540 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
2014 లో ప్రభుత్వ- ప్రయివేటు రంగంలో ఎంబీబీఎస్ సీట్లు కేవలం 2600 ఉన్నయి. వాటిని నేడు 6540కు పెంచుకున్నం.
ఇవి కాక ఆయుష్,ఆయుర్వేద,యూనాని వంటి విభాగాల్లోను సీట్లు ఉన్నయి.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 850 ఎంబీబీఎస్ సీట్ల నుండి 2901 కు పెంచుకున్నం. అంటే 2052 సీట్లు అదనంగా పెంచుకోగలిగాం.
ఇది వైద్య విద్యార్థులకు, తల్లిదండ్రులకు పండుగ శుభవార్త.
బి క్యాటగిరీ సీట్లలోను 85 లోకల్ రిజర్వేషన్లు అమలు అయ్యేలా చర్య తీసుకున్నం. దీని వల్లతెలంగాణ వైద్య విద్యార్థులే ఇక్కడ చదువుకునే అవకాశం కలుగుతుంది.
ఈ నిర్ణయ వల్ల 1067 సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కనుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయం వల్ల తెలంగాణ విద్యార్థులు వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది. అదే రీతిలో పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వస్తుంది.
ఈవాళ బీజేపీ ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తోంది. మాటలు ఎక్కువ చేతలు తక్కువ.
157 మెడికల్ కాలేజీలు దేశంలో మంజూరు చేస్తే, తెలంగాణకు ఒక్క కాలేజీ మంజూరు చేయలేదు. రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు రాలేదని చెప్తే, రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖలు బయటపెట్టాం.
కేంద్రం మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి ఇవ్వకపోయిన, సొంత డబ్బులతోనే జిల్లాకో కాలేజి పెట్టాలని సీఎం కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నరు.
ఇవాళ మెడికల్ సీట్లు , మెడికల్ కాలేజీలు పెరిగాయంటే అందుకు కారణం బడ్జెట్లో వైద్య రంగానికి సీఎంగారు ఎక్కువ నిధులు కేటాయించడం వల్లే సాధ్యమయింది.
నాగర్ కర్నూల్, వనపర్తి, కొత్తగూడెం, మహబూబాద్, రామగుండం, జగిత్యాల వంటి ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు వస్తున్నయి. దీని వల్ల 650 పడకల ఆసుపత్రి వస్తుంది. 30 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పేదలకు అందుతాయి. ఇప్పటికే గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు రెఫరల్స్ తగ్గాయి.
కేంద్రం మొండి చేయి చూపినా రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున కాలేజీలు, మెడికల్ సీట్లు పెంచుకునేలా చర్య తీసుకుంది. 12 కొత్త కాలేజీలు పెట్టుకున్నం. తద్వారా 17 మెడికల్ కాలేజీలు తెలంగాణలో ఉండనున్నాయి.
రేపూ మాపో వైస్ ఛాన్సలర్ ఈ కొత్త కాలేజీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
పీజీ సీట్ల సంఖ్య కూడా పెంచుకున్నం. 2014లో 613 పీజీ సీట్లు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉంటే నేడు అవి 1249కు చేరుకున్నయి.
దేశంలో ఇంత పెద్ద ఎత్తున పీజీ సీట్లు పెంచుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. 192 పీజీ సీట్లు ఈ విద్యాసంవత్సరంలో కొత్తగా అందుబాటులోకి వస్తున్నాయి. ప్రభుత్వ- ప్రయివేటు రంగంలో పీజీ సీట్ల సంఖ్య ప్రస్తుతం 2449కు చేరింది.
నర్సింగ్ కాలేజీలు 2014లో కేవలం 4 మాత్రమే. కాని ఇవాళ 19కు పెరిగాయి. బాన్సువాడ, జగిత్యాల, గద్వాల సిద్దిపేట, సిరిసిల్లలో ప్రారంభమయ్యాయి. మరో పది త్వరలో ప్రారంభం కానున్నాయి.
70 ఏళ్లలో నాలుగు నర్సింగ్ కాలేజీలు పెడితే, 8ఏళ్లలోతెలంగాణ ప్రభుత్వం 19 కు పెంచింది.
నర్సింగ్ సీట్లు 2014లో 240 ఇప్పుడు 1680కు చెరుకున్నాయి.
1440 కొత్త నర్సింగ్ సీట్లు పెరిగాయి.
ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ పెట్టాలన్నది సీఎం గారి ఆకాంక్ష.
నర్సింగ్ విద్యలో విద్యార్థులకు స్టైఫండ్ పెంచడంజరిగింది.
ఆర్ఎంపీలు పీఎంపీలకు సంబంధించి నా వ్యాఖ్యలను వక్రీకరించారు.
అనాధరైజ్డ్ ప్రాక్టీషనర్స్ ను కట్టడి చేయాలని ఎవరు దరఖాస్తు ఇవ్వకపోయినా స్పెషల్ డ్రైవ్ పెట్టాం. గతంలో రాష్ట్రంలో ఎవరూ ఇంత పెద్దడ్రైవ్ చేయలేదు.
కొద్ది మందిఅనాథరైజ్డ్జ్ ప్రాక్టీషన్ చేయడం వల్ల ప్రాణాలు పొతున్నయి అక్కడ అక్కడ అని స్పెషల్ డ్రైవ్ పెట్టాం. 33 జిల్లాలో స్పెషల్ టీంలు పెట్టి డ్రైవ్ చెప్టటాం.
103 హాస్పిటల్స్ సీజ్ చేశాం. 633 హస్పిటల్స్ కు నోటీసులు ఇచ్చాం. 75 ఆసుపత్రులపై జరిమానాలు విధించడం జరిగింది.
అనాథరైజ్డ్ ప్రాక్టీషనర్స్ పై ఉక్కుపాదం మొపాం. ప్రజల ఆరోగ్యం కాపాడంలో రాజీ లేదు.
ఒక శాసన సభ్యుడు మా దగ్గరకు తీసుకువచ్చి ఆర్ఎంపీలు,పీఎంపీలపై డీఎంహెచ్వోలు వెధింపులకు దిగుతున్నరని చెప్పితే, మీరు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి లేకపోతే చర్యలు తప్పవని , మీరు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తే వేధింపులు లేకుండా అధికారులకు చెబుతామన్నాం . తప్ప ఎక్కడా అనాథరైజ్డ్ ప్రాక్టీషనర్స్ కు మద్ధతు ఇచ్చినట్లు కాదు. నా వాఖ్యలను కొందరు వక్రీకరించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై….
ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకుండా మేమే కాలేజీలు ఇచ్చాం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడడం దిగజారుడు రాజకీయం.
కేంద్ర మంత్రి తన స్థాయి దిగజార్చుకోని సిల్లీగా మాట్లాడుతున్నరు.
మీరు మెడికల్ కాలేజీ ఇస్తే ఎక్కడ ఇచ్చారో చెప్పండి. కాగితాలు చూపించండి.
పేరుకు ఎయిమ్స్ ఇచ్చారు. అక్కడ ఆపరేషన్ ధియెటర్లేదు. ఆక్సిజన్ లేదు. బ్లడ్ బ్యంకులేదు. ఒక్క ఆపరేషన్ జరగడం లేదు.
అక్కడి వైద్య విద్యార్థులు తమ విద్య ఆగం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటే వారు భువనగిరి ఆసుపత్రిలో ప్రాక్టికల్స్ చేస్తున్నరు.
కాలేజీ ఇవ్వకుండా ఇచ్చామని చెప్పడం దిక్కుమాలిన రాజకీయం. కిషన్ రెడ్డి గారు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్న.
డాక్టర్ అయిన గవర్నర్ గారు ట్వీట్ సరి కాదు. వారికి వివరాలు పంపిస్తాం.
మెడికల్ కాలేజీలకు కేంద్రం ఒక్క రూపాయి అయినా ఇచ్చిందా… ఇస్తే అది చెప్పాలి.