అనంతపురం జిల్లా , గుత్తి : ఓ మనిషి కనిపించకుండా పోతే వారి కుటుంబ సభ్యులు అనుభవించే ఆవేదన వర్ణనాతీతం. సంవత్సరాల అనుబంధం ఉన్న రక్తసంబంధీకులు ఉన్నట్టుండి కనిపించకపోవడంతో ఆ వ్యక్తి భార్యాపిల్లలు.. తల్లిదండ్రులు.. తోబుట్టువులు.. ఆందోళనలో మునిగిపోతారు. ఆ వ్యక్తి ఆచూకీ తెలిసేవరకు వేదనతో కుంగిపోతారు. గుత్తి సిఐ సమాచారం ప్రకారం .. ఈరోజు గుత్తిలో ఓ బాలుడు అదృశ్యమయ్యాడు వివరాల్లోకి వెళితే .. గుత్తి టౌన్ దగ్గరలోని మాసినేని స్కూలుకు ఆటోలో గుత్తికి వచ్చి .. గుత్తి నుండి స్కూలుకి పోలేదని, సాయంత్రం అయినా కూడా ఇంటికి రాలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ఎవరికైనా కనబడితే గుత్తి సిఐ వారికి ఫోన్ చేసి తెలుపగలరు. బాలుడి పేరు : ఎం. సాయి నిఖిలేశ్వర్ రెడ్డి, వయసు : 15 సం. గ్రామం అబ్బిదొడ్డి , అనంతపురం జిల్లా
గుత్తి సిఐ ఫోన్ నంబర్ : 9346010582, ఎస్సై ఫోన్ నంబర్ : 9346917082