కరీంనగర్ జిల్లా: చిగురుమామిడి మండలం: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ మంచి నీళ్ల పండుగ కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమములో పాల్గొన్న స్థానిక జడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మిషన్ భగీరథ కార్యక్రమంలో ప్రతీ ఇంటికి నల్లాల ద్వారా సురక్షితమైన త్రాగు నీటిని అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఉమ్మడి రాష్ట్రములో భూగర్భ జలాలలో కలుషితమైన నీరు, అధిక మోతాదులో ఫ్లోరైడ్ వలన ఫ్లోరోసిస్ వ్యాధి, కలరా, టైఫాయిడ్, మూత్రపిండాల వ్యాధుల బారిన పడే వారు. ప్రస్తుతం గోదావరి, కృష్ణ నదుల నుండి ఉపరితల జలాలతో అంతర్గత పైపులైన్ల ద్వారా ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి శుద్ధి చేయబడ్డ నీళ్లు అందిస్తున్నది తెలగాణ ప్రభుత్వం. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రశంసిస్తూ దేశములో సమగ్ర నీటి పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రముగా కితాబిచ్చింది. అంతేగాక దీనిని ఆదర్శంగా హర్ ఘర్ జల్ పథకం పేరుతో దేశం మొత్తానికి అమలు చేయాలనడం తెలంగాణకు గర్వకారణమన్నారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బెజ్జంకి లక్ష్మణ్, గ్రామ ప్రత్యేకాధికారి రాకేష్ రెడ్ది, ఆర్ డబ్ల్యు ఎస్ ఎఈ వినయ్ సాయి, పంచాయితీ కార్యదర్శి గడ్డం వెంకటరమణ, సెర్ఫ్ మహిళలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.