మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలనికి చెందిన కొండగొర్ల చంద్రశేఖర్ మిత్రసర్వీసెస్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. ఐఐటీఏ మిత్రసర్వీసెస్ ఏజెన్సీ సిబ్బందికి శిక్షణ పత్రాలు అందాయి. శనివారం మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటలిజెన్సీ ట్రైనింగ్ అకాడమీ లో మిత్రసర్వీసెస్ ఏజెన్సీ శిబ్బందికి శిక్షణ పత్రాలు ఐఐటీఏ సిటీ అడిషనల్ కమిషనర్ ప్రమీల గారి చేతుల మీదగా అందజేశారు.ఈ సందర్భంగా మిత్రసర్వీసెస్ ఏజెన్సీ మేనేజింగ్ పాట్నర్ కొండగొర్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రయివేట్ సెక్యూరిటీ ఏజెన్సీ లు పాసరా చట్టం 2005 ప్రకారం లైసెన్స్ ఉన్నవారు మాత్రమే సెక్యురిటి ఏజెన్సీ లు నిర్వహించాలని ఉన్నదని కాబట్టి ప్రభుత్వం సూచించినట్టు లైసెన్స్ మరియు ట్రైనింగ్ పూర్తి చేశామని మాల్స్, హాస్పిటల్, కమ్యూనిటీ సెంటర్లకు నాణ్యమైన భద్రత కల్పించెలా చూస్తామని ,పోలీస్ డిపార్ట్మెంట్ కి సహకరిస్తూ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా మా సిబ్బందికి శిక్షణ ఇస్తూ భద్రత కల్పిస్తామని అన్నారు.