స్థానిక దేవత నగర్ లో చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ చే నడపబడుతున్న చైతన్య అనాధ ఆశ్రమం ఆనంద వృద్ధాశ్రమం మరియు
ముత్తు ఆంగ్ల మాధ్యమ (ఉచితము గా కార్పొరేట్ విద్య) పాఠశాలలను మదనపల్లె శాసనసభ సభ్యులు షాజహాన్ బాషా సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరందరూ నిరాదారణకు గురైన పిల్లలు కాదు అందరికీ అండగా మనమందరం ఉంటాం నేను ప్రత్యేకంగా తోడుగా నీడగా ఉంటాను అన్నారు అంతేకాకుండా బి కే పల్లి దగ్గర ఇచ్చిన స్థలంలో మీరు నిర్మాణాలు చేసుకోండి అన్నింటికీ తోడుగా అండగా నేనుంటానని ప్రతి నెలా ఇంత మొత్తం లో అద్దె విద్యుత్తు నీటి చార్జీలు భరించడం చాలా కష్టం కాబట్టి వెంటనే మీరు బికేపల్లి లో మీకు కేటాయించిన స్థలంలో ఆశ్రమ పనులు ప్రారంభించుకోమని కావలసిన అన్ని రకాల అనుమతులు నేను ఏర్పాటు చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపీ ఆనందన్ ,ఎమ్మెల్యే కి శాలువా తో సత్కరించి అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ డాక్టర్ జి వి ఎస్ బాబు జనరల్ సెక్రటరీ కవిత రాణి ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పట్నం గిరిజమ్మాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణ చరణ్, గార్లు షీల్డ్, మరియు జ్ఞాపిక లను అందచేశారు ఈ కార్యక్రమంలో ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల ఉపాధ్యాయని ఉపాధ్యాయులు అజయ్, జనార్ధన్, రెడ్డి శంకర్, గౌసియాబేగం, వెంకటేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.