మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి ఈ నెల 8న మంత్రి కేటీఆర్ విచ్చేస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ సింగరేణి ప్రాంతమైన బెల్లంపల్లి పట్టణంలో గత 40, 50 సంవత్సరాల నుండి సింగరేణి, ప్రభుత్వ భూముల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని అట్టి భూమిపై ఎలాంటి హక్కు లేకుండా అత్యవసర పరిస్థితుల్లో అమ్మలేకుండా పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ ల దృష్టికి తీసుకువెళ్లడంతో పట్టణ ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరిందన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విచ్చేస్తున్న సందర్భంగా కార్యక్రమానికి లబ్ధిదారులు, నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, ఎంపీపీ గొమాస శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.