కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అమలు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిందని మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మండలం పరిధిలోని గుండ్లపల్లి, గునుకుల కొండాపూర్ గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆరు గ్యారంటీ పథకాల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. చొక్కారావుపల్లి, గోపాల్ పూర్ గ్రామాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే
జంగపల్లి లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజన వివరాలు తెలుసుకొని ఉపాధ్యాయులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మంచి విద్యను అందించి ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం కల్పించాలని సూచించారు.అనంతరం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,కస్తూర్బ పాఠశాల నిర్మాణం కోసం అధికారులతో కలిసి స్థలాలను పరిశీలించారు.చీమలకుంటపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు బామండ్ల రవీందర్ సోదరి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వధించారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి లింగాల మల్లారెడ్డి, సర్పంచ్ లు బేతెల్లి సమత రాజేందర్ రెడ్డి, లింగంపెల్లి జ్యోతి బాలరాజు, నగేష్, ముస్కు కరుణాకర్ రెడ్డి, స్పెషల్ ఆపీసర్ జడ్పీసిఈఓ పవన్ కుమార్, తహశీల్దార్ బిక్షపతి, ఎంపీడీవో స్వాతి, నాయకులు ముస్కు ఉపేందర్ రెడ్డి, అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, బొడ్డు సునీల్, కొమ్మెర రవీందర్ రెడ్డి,ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.