- మాచర్ల నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు మరియు ప్రభుత్వ ఉపాధ్యాయుల “ఆత్మీయ సమ్మేళనం”
పల్నాడు జిల్లా మాచర్ల : ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ వారి ప్రయోజనాలే పరమావధిగా పని చేస్తున్న తీరును వివరంగా తెలియచేసి, వారితో సన్నిహిత సంబంధాలను నెలకొల్పుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాలు మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళుట ముఖ్య ఉద్దేశంగా ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్, జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ ముఖ్య అతిధులుగా పాల్గొంటున్నారు. అలాగే నియోజకవర్గ అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటారు. సదుద్దేశంతో పెట్టే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనీ అధికారులను , ఉదోగులను పిన్నెల్లి కోరారు