కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: గన్నేరువరం, జంగపల్లి గ్రామాల్లో బుధవారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పర్యటించారు. గన్నేరువరం లో సీసీ రోడ్ల నిర్మాణాలను ప్రారంభించి జంగపల్లిలో ముదిరాజ్ సంఘం భవనాన్ని ప్రారంభించారు. అలాగే ఆయా గ్రామాల్లో కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. గ్రామాల అభివృద్ధి మా లక్ష్యమని ఇందులో భాగంగా అనేక అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, పిఆర్ఏఈ స్నేహ జ్యోతి, సర్పంచ్ ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు తీగల మోహన్ రెడ్డి, బూర వెంకటేశ్వర్లు, సర్పంచులు అట్టికం శారద,పీచు చంద్రారెడ్డి, ఎంపీటీసీ అట్టికం రాజేశం గౌడ్, డైరెక్టర్లు గొల్లపల్లి రవి,అట్టికం రవి,మహ్మద్ రఫీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.