- ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ని కలిసిన ఆశా కార్యకర్తలు
- ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా ఉంటుందని అభయం
- ఆశకార్యకర్తలకు జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ గారిదే
- ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారికి రాఖీ కట్టిన ఆశకార్యకర్తలు
- ఇల్లులేని ఆశకార్యకర్తలకు గృహాలక్ష్మి ద్వారా 3లక్షల సాయం అందిస్తాం
కరీంనగర్ జిల్లా: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు ఆశకార్యకర్తల వేతనాలు రూ. 1500ల కంటే ఎక్కువ ఉండేది కాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై కేసీఆర్ గారు సీఎం అయ్యాక ఆడబిడ్డలు చాలీచాలని వేతనంతో కన్నీరు పెట్టొదనే లక్షంతో సీఎం కేసీఆర్ ఆశకార్యకర్తలకు రెండు సార్లు వేతనాలు పెంచి అండగా నిలబడ్డారని అన్నారు. ఆశకార్యకర్తలు తమ సమస్యలు పరిష్కారం చేయాలని గౌరవ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ని క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు.
ఆశకార్యకర్తలు గౌరవ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కి బొట్టుపెట్టి, రాఖీ కట్టారు ఆడబిడ్డలు అధైర్యపడొద్దని.. ప్రభుత్వం అండగా ఉంటుందని దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని ఆశా కార్యకర్తలకు రూ.9750 వేతనాలు ఇస్తూ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆశకార్యకర్తల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇల్లులేని ఆశకార్యకర్తలకు గృహాలక్ష్మి పథకం ద్వారా రూ.3లక్షల సాయం అందించడం జరుగుతుందని, ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బ్రతకాలన్నదే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆశకార్యకర్తలకు ఏ సహాయం కావాలన్న అందుబాటులో ఉండి చేస్తానని సూచించారు.