సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బేగంపేట్, వడ్లూర్,గూడెం,లక్ష్మీపూర్ గ్రామాలలో మంగళవారం రోజు స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విస్తృతంగా పర్యటించి లబ్ధిదారులకు “కళ్యాణ లక్ష్మీ”చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, మా ప్రభుత్వం విధానమె సంక్షేమమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చింతలపెల్లి సంజీవ రెడ్డి, ఎంపిటిసి పోతురెడ్డి స్రవంతి, మధుసుధన్ రెడ్డి, ఎంపిపి లింగాల నిర్మల లక్ష్మీన్, జడ్పీటీసీ కనగండ్ల కవిత తిరుపతి, బారాస పార్టీ అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్ గుప్తా, సోషల్ మీడియా ఇంచార్జ్ ఎల శేఖర్బాబు, లింగాల శ్రీనివాస్, మేకల శ్రీకాంత్, బిగుళ్ల సుదర్శన్, బెజ్జంకి పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
