- రోడ్డు పై చేపలు పట్టి నిరసన.
- తక్షణమే అధికారులు, నాయకులు స్పందించాలి..
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల ప్రధాన రహదారి గుంతల మయంగా మారి రోడ్డుపై నీరు నిలవడంతో బురదలో చేపల వళతో చేపలు పట్టి రోడ్డు పనులు ప్రారంభించాలని నిరసన తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం పొరాడదని ప్రజల సమస్యలపై పోరాడుతుందని అన్నారు. కొందరు నాయకులు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని అన్నారు.ప్రజలు రోడ్డువల్ల ఇంత ఇబ్బంది పడుతున్న ఎమ్మెల్యే, అధికారులు చోద్యం చూస్తున్నారని అన్నారు. అలాగే కథలపూర్, మేడిపల్లి, భీమారం మండలాల పర్యటనకు ఇదే గుంతల రోడ్డుపై వెళ్తున్న ఎమ్మెల్యే రమేష్ బాబు కు రోడ్డు వేద్దాం అని ఎందుకు సోయి రావడం లేదని ప్రశ్నించారు.శుక్రవారం అన్ని మండలాలు తిరిగిన ఎమ్మెల్యే రుద్రంగి లో ఎందుకు ఆగలేదని రైతులను, రోడ్లను ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు.డివైడర్ వేసి మూడు సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి రోడ్డు వెడల్పు పనులు చేయకపోవడంతో రోడ్డు గుంతలు పడి ప్రజలు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నరని అన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యే గా గెలిచి రుద్రంగి లో ఏ ఒక్క హామీ నెరవేర్చలేరని ఎద్దేవా చేశారు..ఎమ్మెల్యే రుద్రంగి గ్రామాన్ని దత్తత తీసుకున్న విశాయన్ని మర్చిపోయారానీ అన్నారు.. ఇప్పటికైనా అధికారులు, ఎమ్మెల్యే స్పందించాలని లేదంటే నియోజకవర్గ స్థాయిలో బిక్షాటన చేసి రోడ్డు పనులు చేస్థామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్,గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి, నాయకులు ఎర్రం గంగనర్సయ్య, ఇప్ప మహేష్, పల్లి గంగాధర్,గట్ల ప్రకాష్, సూర యాదయ్య,మాడిశెట్టి అభిలాశ్,కట్కూరి దాసు,ఎర్రం శ్రీనివాస్,గంధం మనోజ్, ధ్యావల దిలీప్,రవీందర్,తోకల గణేష్ తదితరులు పాల్గొన్నారు..