మంచిర్యాల జిల్లా,చెన్నూరు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్య వ్యాఖ్యలను ఖండిస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని ఎమ్మెల్యే డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై విమర్శలు చేయడం సరికాదని బిఆర్ఎస్ నాయకులు గతంలో కెసిఆర్ కేంద్ర మంత్రులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం నేడు క్రింది స్థాయి నాయకులు రాష్ట్ర మంత్రులను రాజకీయ లలో దిగజారి ఒక నీచ ప్రవర్తనను పోషిస్తున్నారని అధికార అహంకారంతో ఎవరిని పడితే వారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంతో తెలంగాణ ప్రజలు బి ఆర్ఎస్ పార్టీని ఓడించి నాయకులకు బుద్ధి చెప్పడం జరిగింది. అయినా వారిలో మార్పు రాకుండా అధికారం కోల్పోయాము అన్న అసహనంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది కానీ మాట్లాడే పద్ధతులు ఇప్పటికైనా నేర్చుకోవాలి లేకుంటే ప్రజలే బుద్ధి చెప్తారు, దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.
