మంచిర్యాల జిల్లా. చెన్నూరు..మండలంలోని కత్తెరసాల మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సరోజ దంపతులు, కుమారుడు వంశి కృష్ణ పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దంపతులను మేళ తాళాలతో ఘనంగా ఆహ్వానించి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, అధికారులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
