నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా ఫాతిమా ప్రయాణిస్తున్న కారు ఢీకొన్న ఘటనలో తీవ్రగాయాల గాయాల పాలై చికిత్స పొందుతున్న బాలుడు దీపక్ తేజ మృతి చెందాడు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మద్యంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం సాయంకాలం ఎమ్మెల్యే భార్య, అనుచరులు ప్రయాణిస్తున్న కారు బోధన్ పట్టణంలోని మర్రి మైసమ్మ వద్ద గల రాయల్.. గార్డెన్ సమీపంలో అజయ్ అలియాస్ దీపక్ అనే బాలుడిని ఢీకొట్టింది. అతడికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. మెదడుకు తీవ్ర గాయాలు కావడంతో వెంటిలేటర్పై చికిత్స అందించారు. అయితే పరిస్థితి క్లిష్టంగా మారడంతో హైదరాబాద్ తరలిస్తుండగా దీపక్ తేజ్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదానికి కారణమైన కారు ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిదని సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
