లిక్కర్ స్కాం కేసులో (Delhi Liquor Scam) ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కవిత ఇంటికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు చేరుకున్నారు. వారిని కవిత నివాసంలోని ఈడీ అధికారులు కొద్దిసేపటి వరకు అనుమతించలేదు. కార్యకర్తలు వారిని లోపలి అనుమతించాలని ఆందోళన చేయగా.. చివరికి కుటుంబ సభ్యులు కావడంతో వారిని లోపలి అనుమతించారు. కేటీఆర్, హరీష్ రావు వెంట మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు.
ఢిల్లీకి కవిత..
ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు.. ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు. కవితను ఢిల్లీ తరలించేందుకు ఈడీ అధికారులు ప్రత్యేక విమానాన్ని బుక్ చేసినట్లు సమాచారం. లిక్కర్ స్కాం కేసులో తదుపరి విచారణను ఢిల్లీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీ కవిత తో పాటు మరికొంత మంది బీఆర్ఎస్ నేతలకు ఈడీ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.