contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

యువత ఉన్నత లక్ష్యాలతో భవిష్యత్తును ఎంచుకోవాలి

మంచిర్యాల జిల్లా..కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎసన్వాయి గ్రామంలో ఏర్పాటు చేసిన యువకులకు చెడు అలవాట్లు వలన కలుగు నష్టాలు, విద్య, ఉద్యోగ సాధనకు చేయవల్సిన కృషి, సైబర్ క్రైమ్స్, ట్రాఫిక్ రూల్స్, తదితరుల విషయాలపై కళా బృందం పాటలతో అవగాహనా కల్పించారు. ఇట్టి కార్యక్రమాన్నీ మంచిర్యాల డిసిపి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ ఐ రాజేందర్ యువత భవిష్యత్తుపై దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ…..యువత ఒక లక్ష్యంను ఎంచుకొని ఎన్నో విజయాలను సునాయాసంగా అందుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. అంతటి శక్తి యువతకి ఉంది అన్నారు. పోలీస్ సేవలు మరింత దగ్గర అవ్వడానికి పోలీస్ ఉన్నది మీకోసం మీభద్రత కోసమే అనే నమ్మకం కలగడం కోసం మీతో మమేకమయ్యామని, ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, ప్రజా శ్రేయస్సే పోలీసుల ద్యేయం అన్నారు.

గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం పరిస్థితులు సౌకర్యాలు ఎన్నో మెరుగు పడ్డాయని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సౌకర్యాలను సద్వినియొగం చేసుకోవాలని, యువత చెడు మార్గాల వైపు మరలకుండా వారితో మమేకమై కమ్యూనిటీ పోలీస్ లో భాగంగా వివిధ కార్యక్రమాలు పోలీస్ శాఖ తరపున నిర్వహిస్తామన్నారు. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఒక మంచి లక్ష్యం తో ప్రయత్నం చేసినప్పుడు తప్పక విజయం సాధిస్తాము అన్నారు. అదేవిదంగా యువత క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయని, స్పోర్ట్స్ కోటా తో కూడా ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. క్రీడలతో శారీరక దారుఢ్యం పెరుగుతుందని, క్రీడల పోటీల నిర్వహణకు పోలీస్ శాఖ తరుపున యువతను ఎల్లవేళలా సహకరించి, ప్రోత్సహిస్తామని అన్నారు

చెడు వ్యసనాలకు దూరంగా ఉండి బాధ్యతగా మెలగాలి,యువకులు మద్యం ,గంజాయి, గుడుంబా ,జూదం వంటి చెడు వ్యసనాలకు, ఇతర చెడు మార్గాల వైపు మరలకుండా చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ఉద్యోగాలు సంపాదించి,తమ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని, గ్రామానికి, జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఎస్ ఐ ఆకాంక్షించారు. గ్రామంలో ఒక్కరికి ఉద్యోగం వస్తే గ్రామంలో పది మంది తన వెంట వస్తారని అన్నారు. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని సంఘ విద్రోహ శక్తులు వీరిని ప్రలోభాలకు గురిచేసి వీరిని చెడు మార్గం వైపు నడిచేలా ప్రోత్సహిస్తారు వారి ప్రలోభాలకు లొంగకుండా మంచిని ఎంచుకుని సమాజ శ్రేయస్సుకు పాటు పడాలని సూచించారు. ఎటువంటి కష్టం వచ్చినా ఎల్లవేళలా పోలీస్ శాఖ వారికి అందుబాటులో ఉంటుందని పోలీసులను సంప్రదించాలని సూచించారు అసాంఘిక శక్తులకు దూరముగా ఉండాలని ,గ్రామాలలో ఎవరైనా అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు కనిపించిన, పోలిసులకు తెలియచేయాలని అన్నారు. ముఖ్యంగా గుడుంబా ఎవరైనా కాచిన అమ్మిన నాకు వెంటనే తెలపాలని ఎస్ ఐ కోరారు

ఈ కార్యక్రమంలో
మాజీ సర్పంచ్ సీమానాయక్ మాజీ ఉప సర్పంచ్ బండి రమేష్ బి సి సెల్ మండల అధ్యకుడు కిష్టయ్య జనరల్ సెక్రటరీ సుఖేందర్ గ్రామ కార్యకర్తలు అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :