మంచిరియల్ జిల్లా, బెల్లంపల్లి: పట్టణంలోని సుభాష్ నగర్ లో ఆర్పీ రజిత విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ .. “బెల్లంపల్లి పట్టణానికి చెందిన సాజీద్, వాజీద్ అనే ఇద్దరు అన్నదమ్ములు గత కొన్ని నెలల క్రితం లోన్ తీసుకున్నారని, అయితే, వారు తీసుకున్న లోన్లు తిరిగి చెల్లించకుండా, లోన్ కట్టాలని అడిగినపుడు తనని బెదిరింపులకు గురిచేస్తున్నారని, కాల్స్ చేసి నోటికి వచ్చినట్లు అసభ్య పదజాలంతో మాట్లాడుతూ, మానసికంగా వేధిస్తున్నారని ఆవేదని చెందింది.
తన ప్రాణానికి హాని ఉందని, సాజీద్, వాజీద్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం పై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.