మందమర్రిలోని కళ్యాణిఖని ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల బెల్లంపల్లి నియోజకవర్గం కాసిపేట మండలం దుబ్బగూడెం గ్రామం కాలగర్భంలో కలిసిపోనుండగా అక్కడి భూనిర్వాసితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఓసీ లో బ్లాస్టింగ్ వల్ల దాదాపు ప్రతి ఇంటికి పగుళ్ళు వచ్చాయని, ఎప్పుడు కూలిపోతాయో తెలియని, పెద్దనపెల్లి శివారులో లేవుట్ చేసినా ఎవరి ప్లాట్ వాళ్ళకి అలాట్ చేయకపోవడంతో అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉందని, అసలు 203 ఇళ్ళు ఉండగా దళారులు, ప్రజాప్రతినిధులు కలిసి ఇంకా 80 ఇళ్ళను టెంపరరీ గా ఏర్పాటు చేసి ప్రభుత్వ సొమ్ము కాజేస్తున్నారని, ప్లింత్ ఏరియాకి, ఓపెన్ ఏరియాకి చాలా తేడాలున్నాయని గతంలోనే కంప్లైంట్ ఇచ్చినా ఎలాంటి రీసర్వే చేయకుండానే నష్టపరిహారం ఇచ్చారని, 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికీ ఫ్యామిలీ ప్యాకేజ్ లో నష్టపరిహారం రావాల్సి ఉన్నా పీడీఎఫ్ వివరాలు తెలియనివట్లేదని, స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కోడ్ భాషలో ఒరిజిన్ డెయిరీ వారితో నెలకో ట్యాబ్లెట్ తప్పించుకోవడం లో ఉన్న శ్రద్ధ ఓటు వేసిన గ్రామస్తులకు రావాల్సిన నష్టపరిహారం ఇప్పించడంలో లేదని, నిర్వాసితుల ఇళ్ళు కూలి ఏదైనా జరగరానిది జరిగితే ఎమ్మెల్యే బాధ్యత వహిస్తాడా అని, కొత్త జియం గారు చొరవ చొరవ చూపి గ్రామాన్ని సందర్శించి సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కన్వీనర్ బొడ్డు వినోద, బెల్లంపల్లి నియోజకవర్గం ఇంచార్జి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
