మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట్ : జర్నలిస్ట్ లు లేకుంటే ప్రజాస్వామ్యం కుంటుపడుతుందని లక్షేట్టిపేట్ జూనియర్ సివిల్ జడ్జి అసదుల్ల షరీఫ్ అన్నారు. శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ భవన్ ఆవరణలో అంగన్వాడీ, మెప్మా, జర్నలిస్ట్ లకు ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జ్ అసాదుల్ల షరీఫ్ మాట్లాడుతూ…… విలేకరుల వృత్తి చాలా విలువైనదని, సమాజంలో దానికంటూ ఒక ప్రత్యేక గౌరవం ఉందన్నారు. ప్రపంచంలో ఏ మూలకు ఏమి జరిగిన మీడియా ద్వారానే పౌరులకు తెలుస్తుందని వివరించారు. రాజ్యాంగంలో ఫోర్త్ ఎస్టేట్ కు ప్రత్యేకత ఉందని అవగాహన కల్పించారు. ఫోక్సో చట్టం, గృహహింస చట్టం, కన్జ్యూమర్ చట్టాల గురించి ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. అంతకుముందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కారుకూరి సురేందర్ మాట్లాడుతూ… విలేకరు వృత్తి అనేది కత్తి మీద సాము లాంటిదన్నారు. అంతకుముందు మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడికొప్పుల కిరణ్ మాట్లాడుతూ…మీడియా నేటి సమాజంలో అత్యంత శక్తి వంతమైదని, దాని పరిమితులు గుర్తించి జర్నలిస్ట్ లు నడుచుకోవాలని సూచించారు. పరిశీలించి, తగిన జాగ్రత్తలు పాటించి, విలువలతో కూడిన న్యూస్ ఉండాలన్నారు.అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బోనగిరి కుమార్ మాట్లాడుతూ…. సమాజం కోసం విలేకరులు కేవలం అతి తక్కువ గౌరవ వేతనంపై పని చేస్తారని, విలేకరుల సేవలు గుర్తించాలని, న్యాయ విజ్ఞాన సదస్సులో పలు చట్టాలపై అవగాహన కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజిపి పద్మ,సీనియర్ న్యాయవాదులు కోమిరెడ్డి సత్తన్న, సురేందర్, ఐసిడిఎస్ సీ డీ పీ ఓ రేష్మ, మెప్మా అధికారి శంకర్, సత్యం,గణేష్, మల్లిఖార్జున్, అంగన్వాడి టీచర్స్, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వేణు గోపాల్, గౌరవ అధ్యక్షులు ప్రసన్న కుమార్, ప్రధాన సలహాదారులు చీకటి తిరుపతి, ఉపాధ్యక్షులు తిరుమలేష్, సౌడం రాజు, నోవా, భాను, ప్రచార కార్యదర్శి ఖదీర్ పాత్రికేయులు పాల్గొన్నారు.