contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వడ్డీ వ్యాపారి బరితెగింపు.. యువకుడిపై దాడి

వికారాబాద్ జిల్లా తాండూరులో గల రాజీవ్ కాలనీకి చెందిన బాలయ్య తన అవసరాల కోసం మేతరి రవి వద్ద అప్పు తీసుకున్నాడు. మూడు నెలల క్రితం రూ.5 వేల అప్పు తీసుకోగా, వడ్డీ కూడా కట్టడం లేదు. దీంతో వడ్డీ వ్యాపారి రవి యువకుడిని తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పు గురించి అడిగాడు. ఫోన్ చేస్తా.. అప్పు కడతానని చెప్పినప్పటికీ వ్యాపారి రవి వినిపించుకోలేదు. దాడి చేశాడు.

వికారాబాద్: వడ్డీ వ్యాపారుల (Moneylender) ఆగడాలు శృతి మించుతున్నాయి. అవసరం ఉందని డబ్బు తీసుకుంటే వడ్డీకి వడ్డీ (Interest) జమ చేసి ముక్కు పిండి వసూల్ చేస్తున్నారు. మరికొందరు తీసుకున్న డబ్బులు ఇవ్వకపోతే భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ఇలాంటి ఘటన వికారాబాద్ (Vikarabad) జిల్లాలో జరిగింది. తీసుకున్న నగదు ఇవ్వడం లేదని, వడ్డీ కూడా కట్టడం లేదని ఒకతినిపై ఓ వడ్డీ వ్యాపారి (Moneylender) దాడికి తెగబడ్డారు. చేతులతో కొడుతూ, కాళ్లతో తంతూ విచక్షణ రహితంగా ప్రవర్తించాడు. అక్కడున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.

ఏం జరిగిందంటే..?

తాండూరులో గల రాజీవ్ కాలనీకి చెందిన బాలయ్య (Balaiah) తన అవసరాల కోసం మేతరి రవి వద్ద అప్పు తీసుకున్నాడు. మూడు నెలల క్రితం రూ.5 వేల అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకున్నప్పటి నుంచి వడ్డీ కూడా కట్టడం లేదు. దీంతో వడ్డీ వ్యాపారి (Moneylender) రవి యువకుడిని తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పు గురించి అడిగాడు. ఫోన్ చేస్తా.. అప్పు కడతానని చెప్పిన రవి వినిపించుకోలేదు. ఇప్పటికే 3 నెలలు అవుతుంది.. అసలు లేదు, వడ్డీ కట్టడం లేదన్నారు. ఆ వీడియోలో మిగతా వారి మాటలు వినిపించాయి. వ్యాపారి రవిని కొట్టొద్దు.. కొట్టొద్దు అని చెప్పినా వినిపంచుకోలేదు. తన చేతులు, కాళ్లకు రవి పని చెబుతూనే ఉన్నాడు.

కుమారుడు చెప్పినా నో

చివరికీ రవి కుమారుడు నాన్న వద్దు కొట్టొద్దు.. ఇప్పటికే చాలా కొట్టావు అని చెప్పడం ఆ వీడియోలో వాయిస్ వినిపించింది. తన డబ్బులు తనకు ఇవ్వాలి అన్నట్టు రవి మొండిగా ప్రవర్తించాడు. బాలయ్యపై విచక్షణరహితంగా దాడి చేశాడు. ఆ వీడియో చూసిన పలువురు వడ్డీ వ్యాపారి రవి తీరును ఖండించారు. బాలయ్యపై ఇలా దాడి చేయడం తగదని అంటున్నారు. రవిపై పోలీసులు కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :