లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం అద్వర్యం లో ఈరోజు ఆగస్టు 26న మదర్ థెరిసా జయంతి వేదికలను ఘనంగా నివార్వహించాము. ప్రెసిడెంట్ లయన్ చెన్న రవికుమార్ ఈ కార్యక్రమంను ఉద్దేశించి మాట్లాడుతూ మదర్ తెరిసా తన జీవితాన్ని కుల,మతాలకు అతీతంగా పేదలకు & నిరుపేదలకు సేవ చేయడానికి అంకితం చేసింది. ఈ రోజు, మనము భారతదేశానికి మరియు ప్రపంచానికి ఆమె చేసిన సేవను గౌరవిస్తాము మరియు ప్రేమ & మానవత్వం యొక్క సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ప్రేరణని కోరుకుంటున్నాము. ఆ మహానుభావురాలుని స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించినాము అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రెజరర్ లయన్ ఉదయ్ కుమార్ , వైస్ ప్రెసిడెంట్ లయన్ చెరుకు పృథ్వీరాజ్ , ఫాస్ట్ ప్రెసిడెంట్ లయన్ అంబల్ల తిరుపతి, సీనియర్ లయన్ మెంబర్ లయన్ జ్ఞాని చావ్లా, మహిళా ప్రాంగణం డి ఈ ఓ పద్మ, అకౌంటెంట్ రాజశ్రీ, శ్వేత, ప్రభ, నిఖిత తదితరులు పాల్గొన్నారు.