ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు విజయవాడ వరద బాధితుల సహాయార్థం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస రెడ్డి వరద బాధితుల సహాయ నిధికి కోటి 50 లక్షల రూపాయలు చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు విజయవాడ కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో అందజేశారు.
ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ పార్లమెంట్ సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి అల్లుడు ఆనం శివకుమార్ రెడ్డి, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.