జగ్గయ్యపేట : ఎస్సీ వర్గీకరణలు భాగంగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జగ్గయ్యపేట నియోజకవర్గం చిల్లకల్లు జాతీయ రహదారిపై ఎంఎస్పి జగ్గయ్యపేట నియోజకవర్గ అధ్యక్షులు మాతంగి దావీదు మాదిగ,మరియు ప్రకాశం జిల్లా ఎమ్మెస్ పి నాయకులు తోరటి ఆనంద్ మాదిగ ఆధ్వర్యంలో చిల్లకల్లు హైవేపై దిగ్బంధ కార్యక్రమం వందలాది మందితో విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం ఎమ్మెస్ పి నాయకులు రావినూతల కోటయ్య మాదిగ, చీరాల నియోజకవర్గ ఎమ్మెస్ పి నాయకులు లక్ష్మి నరసయ్య మాదిగ,కొండేపి నియోజకవర్గ ఎమ్మెస్ పి నాయకులు పూనూరి కృష్ణాపర్ మాదిగ, కనిగిరి నియోజకవర్గం వెలిగండ్ల మండల ఎమ్మెస్ నాయకులు తగరం ఏసు మాదిగ, పామూరు మండల ఎమ్మెస్ పి నాయకులు రాచూరి ప్రకాశం మాదిగ, సిఎస్పురం మండలం ఎమ్మెస్ పి నాయకులు జెపి రాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ ప్రకాశం జిల్లా కో కన్వీనర్ చదలవాడ కిట్టు మాదిగ, ప్రకాశం జిల్లా ఎమ్మార్పీఎస్ కో కన్వీనర్ గౌడపేరు కాంతారావు మాదిగ,వత్సవాయి మండలం ఎం ఎస్ పి నాయకులు జిల్లేపల్లి రమాకాంత్ మాదిగ, చిల్లకల్లు ఎంఎస్పి నాయకులు కంబాల సురేష్ మాదిగ, రావిరాల ఎమ్మెస్ పి నాయకులు ఇనుపంగుర్తి సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు